Listen to this article

మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన కుమార్, ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య,

జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జెడ్పిటిసి, ఎంపీటీసీ,ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్స్,అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్,తో పంచాయతీ కార్యదర్శులకు, సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని జెడ్పిటిసి,ఎంపీటీసీ, ఎన్నికలకు12 ఎంపీటీసీ స్థానాలకు,70 పోలింగ్ స్టేషన్లను,గుర్తించడం జరిగింది.అన్ని పోలింగ్ స్టేషన్లో పవర్ సప్లై, వాటర్ సప్లై,ర్యాంపు, టాయిలెట్లను,ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.12 ఎంపీటీసీ స్థానాలకు నలుగురు రిటర్నింగ్ ఆఫీసర్స్,ని నియమించారని అన్నారు.ఐదు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, నియమితులయ్యారని అన్నారు.ఈ అధికారులు 2025/10/09 న గురువారం నుంచి జెడ్పిటిసి,ఎంపీటీసీ, ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారని అన్నారు. నామినేషన్లు స్వీకరించడానికి నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు. జెడ్పిటిసి నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ గా మండల ప్రత్యేక అధికారి నూతన్ కుమార్,ను నియమించడం జరిగిందని అన్నారు. జెడ్పిటిసి నామినేషన్ గురువారం నుంచి స్వీకరించబడునని అన్నారు.ఈ కౌంటర్ మండల పరిషత్ కార్యాలయంలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు.నామినేషన్ స్వీకరించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సమీక్షించి రేపటిలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు.నామినేషన్ వేయడానికి సంబంధించిన నామినేషన్ పత్రాలు, అలాగే ఓటర్ లిస్టు, ఇతర ఏర్పాట్లు అన్ని కొనసాగుతున్నాయని అన్నారు.ఎన్నికలకు కావాల్సిన సామాగ్రిని జిల్లా పరిషత్ నుంచి సప్లై చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో లక్ష్మణ్,ఎంపిటిసి ఆర్వోలు నలుగురు, ఏఆర్వోలు ఐదుగురు ,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.