Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 7 నడిగూడెం

సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై కోర్టు ప్రాంగణంలో దాడి ప్రయత్నం జరగడం అత్యంత దారుణం అని ప్రముఖ న్యాయవాది చల్లా కోటయ్య మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇది న్యాయవ్యవస్థ గౌరవం, స్వాతంత్ర్యానికి ముప్పు, న్యాయవృత్తి నైతిక విలువలను అవమానపరచే ఇటువంటి చర్యలు అంగీకారయోగ్యం కావని,ప్రతి న్యాయవాది రాజ్యాంగ విలువలను, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడే బాధ్యతతో వ్యవహరించాలనీ, ప్రజాస్వామ్య పరిరక్షణలో మనందరం ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.