ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు లు పంపిణీ చేయాలి.
జుక్కల్ అక్టోబర్ 8 జనం న్యూస్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ యస్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలని పిట్లం మండలం లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు మాట్లాడారు. కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి జడ్పీటీసీతో ఎంపీటీసీ, సర్పంచ్ వార్డుమెంబర్ పదవులను కైవసం చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే టిక్కెట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కష్టపడి పనిచేస్తే.. బి ఆర్ యస్ పార్టీ ని గెలిపిస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలు అమలు చేయలేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ అందించాలని హన్మంత్ షిండే అన్నారు.రైతులకు ఎన్నో గోసలు పెడుతున్నారు. యూరియా కొరకు పడిగాపులు కాస్తున్నారు.కెసిఆర్ ప్రభుత్వం లో ఏనాడు రైతు కంట నీరు రాలేదు రైతులకు సంతోషం ఉంచిన నాయకులు కెసిఆర్ మాత్రమే.ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా మాజీ zp చైర్మన్ దాపేధర్ రాజు, బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్,, మద్నూర్ మండల్ పార్టీ అధ్యక్షుడు బన్షి పటేల్, జుక్కల్ మాజీ ఎంపీపీ యశోద నీళ్లు పటేల్ బిచ్కుంద మాజీ జెడ్పిటిసి భారతి రాజు, మాజీ ఎంపీపీ లు, మాజీ జడ్పీటీసీ లు, మాజీ సర్పంచ్ లు, సొసైటీ చైర్మన్ లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




