Listen to this article

జనం న్యూస్, అక్టోబర్ 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

జగదేవపూర్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగదేవపూర్ మండలంలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది..ఈ నేపథ్యంలో బీసీ మహిళా స్థానంగా కేటాయించిన జడ్పీటీసీ సీటు నుంచి పోటీకి సిద్ధమని ధర్మారం గ్రామ మాజీ సర్పంచ్, కొరివి కృష్ణ స్వామి జిల్లా అధ్యక్షులు పిట్టల రాజు ముదిరాజ్, భార్య పిట్టల కవిత ముదిరాజ్ బరిలో సిద్ధంగా ఉన్నారు.హైదరాబాద్ లోని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నివాసం లో ధర్మారం గ్రామ మాజీ సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్, పలువురు మర్యాద పూర్వకంగా హరీష్ రావు ను కలిశారు, జగదేవపూర్ మండలం లో ముదిరాజుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని 11 గ్రామాల ప్రజల, సర్పంచ్ ల మద్దతు ఉందని నాకు సంస్థల ఎన్నికల్లో ధర్మారం గ్రామానికి జడ్పీటీసీ అవకాశం కల్పించాలని హరీష్ రావు ను కోరారు, మండల నాయకులందరూ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకోవాలన్నారు.
జగదేవపూర్ జడ్పీటీసీ బిఅర్ఎస్ పార్టీ నుండి బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానన్ని… బి ఆర్ ఎస్ పార్టీ గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాత్రం రాజు ముదిరాజ్ అభ్యద్రిత్వం పట్ల పార్టీ శ్రేణుల్లో,మండల ముదిరాజ్ కుటుంబాల్లో పల్లెల్లో సానుకూలత వ్యక్తం అవుతుండడంతో ఆయనకు టికెట్ ఖాయమని భావన వ్యక్తంమౌతోంది.బిఆర్ ఎస్ పార్టీ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,నియోజక వర్గం ఇంచార్జీ వంటేరు ప్రతాపరెడ్డి లు నన్ను విశ్వసించి అవకాశం ఇస్తే తప్పకుండా గెలిచి చూపిస్తాను…అని ప్రజా సేవే నా ధ్యేయం అని చెప్పారు,ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామీణ సమస్యలపై తన గళం వినిపిస్తానని రాజు ముదిరాజ్ స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమై పని చేసే నాయకత్వం అవసరమని, రాజకీయాలు ప్రజా సేవకు వేదిక కావాలని అన్నారు.మండలం లో అభ్యర్థుల ఎంపిక పై ప్రజల ఎదురు చూపు…మండలంలోని బడుగు బలహీన వర్గాల పల్లెల్లో ఎక్కువగా ముదిరాజ్ ఓట్లు ఉండటం తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రాజు ముదిరాజ్ కు టికెట్ కేటాయిస్తే పార్టీ సులువుగా గెలుస్తుందని పలువురు నేతలు ప్రజలు కూడా సూచించినట్లు తెలుస్తోంది.