పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఈర్ల రామకృష్ణ (ఆర్కే), తిరుమలకొండ అన్నపూర్ణ
జనం న్యూస్- అక్టోబర్ 9- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ (ఆర్కే), నందికొండ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ తిరుమల కొండ అన్నపూర్ణలు ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జైవీర్ రెడ్డిని గజమాలతో సన్మానించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ తిరుమల కొండ అన్నపూర్ణ, మాజీ కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ ( ఆర్కే), యువజన కాంగ్రెస్ నాయకులు పగడాల నాగరాజు, ఆదాసు విక్రం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


