సిపిఐ(ఎం) జడ్పీటీసీ అభ్యర్థిగా గుడ్ల వెంకటేశ్వరరావు పేరు పరిశీలన.
జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 8 :
ఏన్కూరు జడ్పీటీసీ (జనరల్) స్థానం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా గుడ్ల వెంకటేశ్వరరావు పేరును పార్టీ పరిశీలిస్తోంది.పొత్తులు కుదరని పక్షంలోనూ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ భావిస్తుంది.విద్యార్థి ఉద్యమ నేతగా ప్రస్థానం ప్రారంభించిన వెంకటేశ్వరరావు, గత మూడు దశాబ్దాలుగా వామపక్ష ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 1996లో సీపీఎం సభ్యత్వం స్వీకరించి, పార్టీకే అంకితమయ్యారు. గతంలో డీవైఎఫ్ఐ, సీఐటీయూ మండల కార్యదర్శిగా పనిచేసి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యారు. రాజకీయ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలబడ్డారు. నిరంతరం ప్రజాక్షేత్రంలోనేక ఉంటూ తన సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. సొంత గ్రామం ఆరికాయలపాడులో ఉప సర్పంచ్‌గా పనిచేయడంతో పాటు, వ్యక్తిగతంగానూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, రైతుల కోసం ఏటా సొంత ఖర్చులతో సాగునీటి కాలువలు, దారుల మరమ్మతులు చేయించడం, వీధిదీపాలు, అంతర్గత రోడ్ల మరమ్మతులు, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం మెడికల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సేవా దృక్పథం కలిగిన వెంకటేశ్వరరావు వంటి వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే మండలానికి ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


