

జనం న్యూస్, అక్టోబర్ 08, బోధన్ నియోజవర్గం నిజామాబాద్
జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐ లు ఎస్ఐ లు గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏఎస్ఐ నుండి ఎస్ఐ పీ లుగా ఇద్దరు ప్రమోషన్ పొంది బుధవారం రోజున నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ను మర్యాద పూర్వకంగా కలిశారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన ఎస్ఐలు బి.ఈశ్వర్ నిజామాబాద్ టౌన్ 3 పీఎస్ నుండి ఆదిలాబాద్ జిల్లా కు, బోధన్ పట్టణానికి చెందిన కె.గంగా ప్రసాద్, రెంజల్ పీఎస్ నుండి అదిలాబాద్ జిల్లా కు పదోన్నతిపై వెళ్లనున్న నేపథ్యంలో వారిని అభినందించారు.
