Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

దరువు అంజన్న చేసిన సమాజ సేవకు తగిన గుర్తింపు సమాజంలో స్వార్థం ఎక్కువైంది మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు కానీ నేడు సమాజంలో స్వార్థం ఎక్కువైందని మనిషిని మనిషిగా గుర్తించె రోజు లేదని అయితే దరువు అంజన్న లాంటివారు తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసి సమ సమాజ సేవ చేయడం హర్షించదగ్గ విషయమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన సేవా రత్న అవార్డు గ్రహీత వడ్లకొండ వెంకట్రావు అన్నారు,ప్రసన్న ఆరోహి ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ వారు సమాజ సేవ చేసిన వారికి ఇచ్చే అవార్డును 2025 గాను దరువు అంజన్నను ఎంపిక చేశారు, హైదరాబాదులో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో దరువు అంజన్నకు ఈ అవార్డు అందజేశారు ఈ సందర్భంగా ప్రసన్న ఆరోహి ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రసన్న ఆరోహి మాట్లాడుతూ నేటి సమాజంలో అన్నదమ్ములు అక్క చెల్లెలు సైతం ఆర్థిక సంబంధాల కూపిలో మునిగిపోయి మానవ సంబంధాలు మర్చిపోతున్నారని అందుకే మేము మా సంస్థ తరఫున సమాజ చేసిన వారికి, ఈ అవార్డు అందజేస్తామని ఈ సంవత్సరం దరువు అంజన్నను ఎంపిక చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత దరువు అంజన్న మాట్లాడుతూ మానవ జన్మ ఎత్తినందుకు సమాజ సేవ చేయాలని అప్పుడే జన్మకు సార్ధకత చేకూరుతుందని ఆయన హితువు పలికారు,ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు కళాకారులు పాల్గొని సంగీత కచేరి చేశారు.