బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య
జనం న్యూస్, అక్టోబర్ 9, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
జగదేవపూర్ జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాలని బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు దాచారం కనకయ్య, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూరియా కోసం అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు అని నిత్యం ఎరువుల దుకాణాల వద్ద పడికాపులు కాసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు,స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ ఇచ్చి గద్దెనెక్కిన తరువాత అమలు ఎందుకు చెయ్యలేదో కాంగ్రెస్ నాయకులను నిలదీయ్యాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలని ఇచ్చి అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని “కాంగ్రెస్ బాకీ కార్డు”తో ఇంటింటికీ ప్రచారం చేసి ప్రజలకు గుర్తు చేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు,స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రేస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి తమవంతు కృషి చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఏ సమస్యలు వచ్చిన పార్టీ అండగా ఉంటుందని అన్నారు.గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేసిన గెలుపుకు అందరు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


