

జనం న్యూస్ జనవరి 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కెపి హెచ్ బీ ఒకటవ రోడ్ నందు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనలు మేరకు.కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద పూలదండ వేసి నివాళులర్పిస్తూ… కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించి వినతి పత్రాన్ని సమర్పించారు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ప్రతి రైతుకు రైతుబంధు…రుణమాఫీ అందేలా వారికి బుద్ధి ప్రసాదించాలంటూ.. గాంధీ మహాత్ముని వేడుకున్నారు.. ప్రజలంతా కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని.. కానీ ఇప్పుడు ప్రజలును నట్టేట ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో పాటు వివేకనంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు.. మాజీ కార్పొరేటర్లు పగుడాలు బాబురావు, మాధవరం రంగారావు, కెపి హెచ్ బీ డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, బాలాజీ నగర్ డివిజన్ ఇంచార్జ్ సాయిబాబా చౌదరి.. నాయకులు సురేష్ రెడ్డి, రాజేష్ రాయ్, పాతూరు గోపి, సాయి శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, శ్రీరామ్ మూర్తి, సాంబశివరావు, తులసి రెడ్డి, మహిళా నాయకులు భవాని, భారతి, రమాదేవి, జాన్ బి, కృష్ణకుమారి, పద్మా రెడ్డి, పద్మావతి, అనురాధ, సుకన్య, బేగం, నగిన, మరియు కాలనీవాసులు, అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు…