జనం న్యూస్ ఆందోళన నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ మున్సిపల్ 9/10/ 2025
జోగిపేట్ పట్టణ పరిధిలో గల ఎన్టీఆర్ స్టేడియంలో జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది, ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున గుప్తా మహేష్ యాదవ్, సాయికుమార్ మరియు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు, క్రీడల్లో పాల్గొన్న వారికి జెర్సీలు అందజేయడం అయినది మరియు మొదటి బహుమతిగా 10000 రెండవ బహుమతిగా 5000 ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ పిల్లలు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడం, మరియు రోగ నిరోధక శక్తిని పెంచడం మరియు నైపుణ్యాలకు మెరుగుపరచడమే కాక మేధాస్ఫూర్తిని సంపాదించడం మరియు ఆనందాన్ని కలిగించడం శారీరక సామర్థ్యాలను మెరుగుపరిస్తూ అనేక ప్రయోజనాలకు ప్రేరేపించడం జరుగుతుందన్నారు.


