తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 10
కంపెనీ నుండి వెలువడుతున్న కెమికల్ వాసనతో గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులు కూడా ఆ వాసనతో అల్లాడిపోతున్నారు.
స్థానికులు చెబుతున్న ప్రకారం, రాత్రి వేళల్లో కంపెనీ నుండి భారీగా గ్యాస్, కెమికల్ వాసనలు వస్తున్నాయి. దీని వల్ల తలనొప్పి, వాంతులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అధికారులు తక్షణమే స్పందించి కంపెనీపై చర్యలు తీసుకోవాలని, పర్యావరణ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్న ఈ కెమికల్ కాలుష్యంపై అధికారులు వెంటనే విచారణ చేపట్టాలి అనే డిమాండ్ బుదేరా గ్రామ ప్రజల్లో జోరుగా వినిపిస్తోంది.


