Listen to this article

వసూళ్లే ధ్యేయంగా పెట్టుకున్న స్థానిక లీడర్

అధికారులు సైతం ఆయన కుప్పట్లోనే..

వాల్టా చట్టానికి తూట్లు..

చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పర్యావరణ అధికారులు

అక్రమ నిర్మాణాలకు ఎల్బీనగర్ జోన్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీనికి కారణం.. వసూళ్లే ధ్యేయంగా పెట్టుకున్న స్థానిక కార్పొరేటర్ అనే ఆరోపణలు విడిపిస్తున్నాయి. ఆయన కనుసన్నలోనే అక్రమ నిర్మాణాల జోరు సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అక్రమ నిర్మాణదారుల నుంచి అడ్డగోలుగా వసూళ్లు చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను సైతం తన గుప్పెట్లో పెట్టుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రతి చిన్న విషయానికి చిలువలు.. పలువలు చేస్తూ.. మీడియాలో రాయించుకునే సదురు కార్పొరేటర్.. ఎన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదనే..? అనుమానాలు కలుగుతున్నాయి. దీని వెనక ఆయన వసూళ్ల పర్వం ఉందని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. గల్లీ కో.. పీఏ..సదురు లీడర్ గారికి డివిజన్ పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణం జరిగిన వసూలు చేసేందుకు కొంత మంది పీ.ఏలు