బిచ్కుంద అక్టోబర్ 10 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని బండ రెంజల్ గ్రామంలో శుక్రవారం నాడు వరి పంటలను పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర సందర్శనలో వరిలో మాని పండు తెగులు, పొట్ట కుళ్ళు తెగులు మరియు సుడిదోమ ఉధృతిని గమనించడం జరిగింది. ఈ తెగుళ్ల నివారణకు చేపట్టవలసిన చర్యలను రైతులకు వివరించడం జరిగింది. అలాగే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ఆశిస్తున్న చీడలు మరియు తెగుళ్లు వాటి నివారణ చర్యలు రైతులకు క్రింది విధంగా వివరించడం జరిగింది.మానిపండు లేదా కాటుక తెగులు నివారణకు ప్రాపికొనజోల్ 200 మి.లీ. ఎకరానికి పిచికారి చేసుకోవాలి.పాము పొడ మరియు పొట్ట కుళ్ళు తెగుళ్ల నివారణకు ప్రాపికొనజోల్ 200 మి.లీ. ఎకరానికి లేదా హెక్సాకొనజోల్ 400 మి.లీ. ఎకరానికి పిచికారి చేసుకోవాలి.
కంకి నల్లి నివారణకు స్పైరోమెసిఫెన్ 100 మి.లీ. ఎకరానికి లేదా ప్రాపర్గైట్ 400 మి.లీ. ఎకరానికి పిచికారి చేసుకోవాలి.సుడిదోమ నివారణకు పైమెట్రోజిన్ 120 గ్రా. ఎకరానికి లేదా డైనోటెఫ్యూరాన్ 120 గ్రా. ఎకరానికి లేదా ట్రైఫ్లుమెజోపైరిమ్ 90 మంది.లీ. ఎకరానికి పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది. ఈ క్షేత్ర సందర్శనలో మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి లక్ష్మణ్ మరియు రైతులు పాల్గొన్నారు.



