జనం న్యూస్ అక్టోబర్ 10 నడిగూడెం
మండల కేంద్రంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం కస్తూరిబా బాలికల విద్యా నిలయంలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యం పై నడిగూడెం పల్లె దవాఖాన డాక్టర్ హరినాథ్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మనసును ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే అనుకున్నది సాధిస్తామని, ఇందుకు మెడిటేషన్, యోగ బాగా ఉపయోగపడుతుందని అన్నారు.మానసిక ఒత్తిడి ఉన్నవాళ్లు, మానసికంగా కృంగిపోయే వాళ్ళు, దురఅలవాట్ల నుండి బయట పడాలనుకునే వాళ్ళు 𝟏𝟒𝟒𝟏𝟔 (టెలిమానస్) ఫోన్ నెంబర్ కు కాల్ చేసినట్లయితే నిపుణులైన వైద్యులచే సమస్యకు పరిష్కారం పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి, కస్తూర్బా గాంధీ విద్యా నిలయం స్పెషల్ ఆఫీసర్ వెంకటరమణ, ఎ.యన్.యం సుజాత, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.


