Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేటితో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారని, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి నాగ జగదీష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాల 255 రోజులు పనిచేసి, నవ్యాంధ్ర సీఎంగా ఆయన పదవీకాలం నేటికీ 6 సంవత్సరాల 110 రోజులు వెరసి 15 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేసుకున్నారని నాగ జగదీష్ అన్నారు. ఈ 15 సంవత్సరాల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు సంక్షోభాలను ఎదుర్కోవడం సంస్కరణలతో ముందుకు సాగడం చంద్రబాబుకే సాధ్యమని, టిడిపి సంక్షోభ సమయంలో పార్టీ క్యాడర్ ను నిలబెట్టుకునేందుకు అనివార్య పరిస్థితుల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ తో పార్టీ విభేదించి 1995 సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారిగా ప్రమాణం స్వీకారం చేశారని, హైదరాబాదును ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందని, ఐటీ హబ్ హైదరాబాదు ను తీసుకురావడంతో హైదరాబాదు రూపురేఖలు మారిపోయాయని, అదే విధంగా నేడు అమరావతిని రూపుదిద్దురానికి అనేక ప్రణాళికలతో విజన్ 2047 పేరుతో మరో చరిత్ర సృష్టించబోతున్నారని, ఇటువంటి నాయకుడు నాయకత్వంలో పని చేయడం కార్యకర్తలకు నాయకులకు గర్వకారంగా ఉందని, ఒక తెలుగుదేశం కార్యకర్తగా గర్వపడుతున్నామని నాగ జగదీష్ అన్నారు. ఒక క్రియాశీలక కార్యకర్తగా ప్రస్తావన మొదలుపెట్టిన నన్ను పెద్దల సభకు శాసనమండల సభ్యులుగా నాకు ఆనందంతో పాటు సమాజంలో సేవ చేయడానికి అవకాశం కల్పించారని, ఆయన నాయకత్వంలో భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తానని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బోడి వెంకట్రావు కుప్పిలి జగన్మోహన్ కాండ్రేగుల సత్యనారాయణ ఎస్ఎఫ్ఐ దాడి అప్పారావు గుడాల సత్యనారాయణ మల్ల గణేష్ కర్రీ మల్లేశ్వరరావు రేఖ రమణమూర్తి రేబాక ఈశ్వర అప్పారావు శ్రీకాకుళం గణపతి సాలాపు నాయుడు విల్లూరి రమణబాబు బర్నికాన శ్రీనివాసరావు కైచర్ల లోకేష్ కొమ్మోజు రామకృష్ణ కాండ్రేగుల వెంకట సూరి పెంటకోట శివరాం కాండ్రేగుల గోపికృష్ణ కాండ్రేగుల రమణ అప్పారావు దాడి జగన్నాథరావు పొలిమేర నాయుడు ఆండ్ర రామకృష్ణ అయోధ్య తదితరులు పాల్గొన్నారు.//