Listen to this article

బిచ్కుంద అక్టోబర్ 10 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ పనులు గత సంవత్సరం నుండి నత్త నడకగా ఆగుతూ, పడుతూ లేస్తూ పనులు కొనసాగించడంతో దుమ్ము ధూళి విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. ఈ దుమ్ము ధూళివలన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో పాటు కళ్ళలో దుమ్ము పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో వర్షాలు పడి రోడ్డుపై గుంతలు ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండపడినచో దుమ్ము ధూళితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వాన పడిన,ఎండ పడిన ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బందులు పడక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైన గుంతలు ఏర్పడడంతో వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని అలాగే గతంలో కూడా ఈ రోడ్డుపై ప్రమాదాలు జరిగి మృతి చెందిన ఘటనలు ఉన్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సెంట్రల్ లైటింగ్ పనులు త్వరలో ప్రారంభించి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.