( బి ఎస్ ఎఫ్ ఐ)రాష్ట్ర కమిటీ
జనం న్యూస్, అక్టోబర్ 10, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
జూలై 28 నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటైన తర్వాత, రంగారెడ్డి జిల్లా ఇంచార్జిగా నియమితులైన చందు (జే ఎస్ ఆర్) అనే వ్యక్తి మెంబర్షిప్ పేరుతో విద్యా సంస్థలకు వెళ్లి, మెంబర్షిప్ చేయకుండా యాజమాన్యాల దగ్గర డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం, అవి కూడా సొంత పనులకు వాడుకోవడం కొనసాగిస్తూ వచ్చాడు. కొద్ది రోజుల క్రితం ( ఫుడ్ పాయిజన్ ) జరిగింది అని రెజోనేన్స్(మాదాపూర్ )కాలేజీకి వెళ్ళి, విద్యార్థుల తరపున మాట్లాడుతున్నాం అన్నట్టు నాటకాలు చేసి యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్ చేసి రూ.20000/- ఇవ్వగానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. గతంలో కూడా చాలా చోట్ల తీసున్నాడు అని కూడా తెలిసింది.ఇవన్నీ కాకుండా ఇంకా ఎన్ని జరిగాయో కూడా తెలియాల్సి ఉంది. ఇన్ని తప్పులు చేసి కూడా ఆర్గనైజేషన్ కి ఉపయోగపడలేదు , ఒక నూతన కమిటీ వేసింది లేదు.బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( బి ఎస్ ఎఫ్ ఐ )అనే ఆర్గనైజేషన్ క్రమశిక్షణ కలిగిన విద్యార్థి ఆర్గనైజేషన్.ఇవన్నీ చేసింది, నిజమే అనే నిస్సిగ్గుగా ఒప్పుకున్న చందుని ఆర్గనైజేషన్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు( బి ఎస్ ఎఫ్ ఐ )రాష్ట్ర అధ్యక్షుడు రాము,మీడియా సమావేశంలో చెప్పారు. ఇలాంటి తప్పులకు పాల్పడుతున్న ఇలాంటి దుర్మార్గులను ఏ ఆర్గనైజేషన్లో కూడా అనుమతించొద్దని కూడా పేర్కొన్నారు.


