

జనం న్యూస్ 30 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
తే 29-01-2025దిన విజయనగరం 1వ పట్టణ పోలీసులకు పట్టణంలో కంటోన్మెంటు ఏరియా రైల్వే కాలనీ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో 1వ పట్టణ సిఐ ఎన్. శ్రీనివాస్ మరియు సిబ్బంది విజయనగరం వట్టణంలో కంటోన్మెంటు ఏరియా రైల్వే కాలనీ గూడ్స్ షెడ్ వద్ద నలుగురు అనుమానిత వ్యక్తులను వట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద సుమారు రెండు కేజీల గంజాయి ప్యాకెట్టు దొరికినట్లుగా తెలిపారు. నిందితులను విచారణ చేయగా వారిలో ఇద్దరు ఎస్.కోటకు చెందిన (1) బోరమాల తరుణ్ తేజ (వయస్సు 19 సం॥లు) (2) సంవంగి బార్గవ్ (వయస్సు 19 సం॥లు) విజయనగరం వట్టణానికి చెందిన (3) సిరికి సాగర్ (వయస్సు 19 సం॥లు) మరియు (4) విజయనగరం వట్టణం జొన్నగుడ్డికి చెందిన పావాడ సాయి చైతన్య (వయస్సు 27 సం॥లు)గా గుర్తించామన్నారు. ఈ నలుగురు వ్యక్తులు గంజాయిని కొనుగోలు చేసి, చిన్న ప్యాకెట్లుగా చేసి పట్టణంలో వలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లుగా విచారణలో గుర్తించామన్నారు. ఇదే విధంగా తే 29-01-2025 దిన విజయనగరం కంటోన్మెంటు ఏరియా రైల్వే కాలనీ గూడ్స్ షెడ్ వద్ద గంజాయి అమ్ముతుండగా వక్కా సమాచారంతో నిందితులను వట్టుకుని, రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీ చేసి, వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయిని సీజ్ చేసి, కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని సిఐ తెలిపారు. వీరితోపాటు ఒక మైనరు (జె.సి.ఎల్.) కూడా ఉన్నట్లుగా వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. నిందితులను అరెస్టు చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన వన్ టౌన్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రామ గణేష్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని డిఎస్పీ ఎం. శ్రీనివాసరావు అభినందించారు.