Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 10 నడిగూడెం

మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని కోదాడ ఎమ్మెల్యే నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. మండలం లోని రత్నవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామిని రవీందర్ రెడ్డి , బృందావనపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ మండవ అంతయ్య లు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ…రవీందర్ రెడ్డి , అంతయ్య ల మరణం చాలా బాధాకరమని అన్నారు.వారు గ్రామాల్లో పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారని వారి సేవలను గుర్తు చేశారు. వారి కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, మండల పార్టీ అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కుటుంబ సభ్యులు,ఇరు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.