Listen to this article

జీతాలు సకాలంలో చెల్లించాలంటూ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి ఉద్యోగుల ఆందోళన

జనం న్యూస్- అక్టోబర్ 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది కి పదవ తారీకు వచ్చిన జీతాలు చెల్లించడం లేదంటూ ఉద్యోగుల ఆందోళన. వైద్య విధాన పరిషత్ లొ పనిచేస్తున్న తమకు సాధారణ ఉద్యోగులతో పాటుగా ప్రతినెలా ఒకటవ తారీఖున జీతాలు చెల్లించాలంటూ ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో రెగ్యులర్ సిబ్బంది 70 మంది ఉండగా కాంట్రాక్ట్ మరియు క్యాజువల్ సిబ్బంది 80 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెల 10వ తారీకు తర్వాతనే జీతాలు వేస్తున్నారని, దీంతో తాము సకాలంలో ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఫీజులు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమలానెహ్రూ ఏరియా ఆసుపత్రి రెగ్యులర్ అండ్ కాంట్రాక్టు వర్కర్స్ పాల్గొన్నారు.