

జనం న్యూస్ అక్టోబర్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
నేషనల్ బెనిఫిట్స్ సంస్థ ఆధ్వర్యంలో, సిఎస్‌ఆర్ నిధులతో రాందేవ్ హాస్పిటల్స్ లో జరిగిన మోనోపాజ్ అవగాహన కార్యక్రమం లో రాందేవ్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ యోబు డైరెక్టర్ డాక్టర్ కరుణాకర్ గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఛాయా నేషనల్ బెనిఫిట్స్ సంస్థ విజయ డాక్టర్ లక్ష్మీ రాజేంద్రప్రసాద్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు
ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళల్లో మోనోపాజ్ దశలో కలిగే శారీరక, మానసిక మార్పులపై మహిళల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని, మహిళలు ఈ దశలో ఎదుర్కొనే మార్పులను అర్థం చేసుకొని సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మహిళలకు గైనకాలజీ సంబంధిత పరీక్షలు, మమోగ్రామ్ టెస్టులు కూడా నిర్వహించారు. రాందేవ్ హాస్పిటల్స్ వైద్యులు, నిపుణులు మోనోపాజ్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, జీవనశైలిలో చేయవలసిన మార్పుల గురించి మహిళలకు వివరించారు.
