

జనం న్యూస్;11 అక్టోబర్ శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
పద్య సాహిత్యం ద్వారా భక్తితత్వం ప్రజలకు చేరుతుందని భక్తిసాధనం నిర్వాహణ అధ్యక్షులు పండరి రాధాకృష్ణ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర దేవస్థానంలో ఆదివారం జరిగిన మాసోత్సవంలో భాగంగా సిద్దిపేటకు చెందిన రచయితలు గండికోట లింగేశ్వరశర్మ రచించిన మధుసూదన శతకం, ఉండ్రాళ్ళ రాజేశం రచించిన కృష్ణ చరితం పుస్తకాలకు గాను వారు ఇరువురికి భక్తిసాధనమ్ వారి సేవభక్తి పురస్కారాలు అందజేశారు. ఈసందర్భంగా పండరి రాధాకృష్ణ మాట్లాడుతూ సిద్దిపేటలో సాహిత్య సంపదకు కొదవలేదని, సిద్దిపేటలోని లలితచంద్రమౌళీశ్వర క్షేత్రంలో అష్టావధానం, శతావధానం, కవిసమ్మేళనం ఇలా వందలాది కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అవధానాలు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పద్య ధారణతో పాటుగా లలిత పారాయణం జరిగింది.