

కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన రణం శ్రీనివాస్ గౌడ్
దౌల్తాబాద్, అక్టోబర్ 11 (జనం న్యూస్ చంటి)
దౌల్తాబాద్ మండల తాజా మాజీ ఎంపీపీ గంగాధర్ సంధ్య రవీందర్ తల్లీ నిన్న మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:“గంగాధర్ కుటుంబం ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుండింది. ఈ క్లిష్ట సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుంది” అని తెలిపారు.సంతాప కార్యక్రమంలో తాజా మాజీ వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ ల ఫోరం నాయకుడు బండారు దేవేందర్, ఎంపీటీసీ తిరుపతి, మాజీ సర్పంచ్‌లు నర్సింలు, స్వప్న జనార్ధన్, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.