Listen to this article

దుబ్బాక అక్టోబర్ 11 (జనం న్యూస్ చంటి)

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్న బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజలు దుబ్బాక ప్రధాన గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ బొడ్రాయి నాభిశిల భూ లక్ష్మి దేవి ప్రతిష్టాపన మహోత్సవం శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ—“దుబ్బాక పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ అభివృద్ధి చెందాలని భూ లక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య , స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు