

జనం న్యూస్ అక్టోబర్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అధ్యక్షులు నియామకం కోసం ఏఐసీసీ ప్రక్రియ ప్రారంభించింది.ఈ మేరకు పార్టీ అధినాయకత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏఐసీసీ అబ్జర్వర్ గా అంజలి నిమ్బల్కర్ ను నియమించింది. అంజలి అధ్యక్షతన శనివారం మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు .ఈ సమావేశానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరయ్యారు. ఆశావహుల నుంచి అంజలి దరఖాస్తులను స్వీకరించారు.దరఖాస్తుల పరిశీలన అనంతరం అభ్యర్థుల సీనియారిటీ, సిన్సియారిటీ నిజాయితీ మేరకు అర్హులైన వారిని జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు .జిల్లా నాయకులతోను ఆమె ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
