

పాపన్నపేట,అక్టోబర్ 11(జనంన్యూస్)
:
బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై ఎంఐఎం అనుభంద సంస్థ మజిలీస్ బచావో తహరిక్ స్పోక్స్ పర్సన్ అంజాదుల్లా ఖాన్ చేసిన వాక్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం రోజు ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలోఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల ఐదో తేదీన ఏడుపాయలలో ఇరు వ్యాపార కుటుంబాల మధ్యలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఒక వ్యక్తి మరణించారని మరణించిన మహబూబ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎంఐఎం అనుబంధ సంస్థ మజిలీస్ బచావో తహరిక్ స్పోక్స్ పర్సన్ అంజాదుల్లా ఖాన్ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసారని దుయ్యాబట్టారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేను పొగుడుతూ బిజెపి ఎంపీపై విషం కక్కుతూ ఎంపీగా రఘునందన్ రావు గెలిచిన తర్వాతనే మతకల్లోలాలు మెదక్లో హెచ్చు మీరాయని అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూన్నా మ్మన్నారు.బిజెపి మండల శాఖ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి ఆధ్వర్యంలో పాపన్నపేట పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.అనంతరం బిజెపి నాయకులు మాట్లాడుతూ మతసామరస్యంతో ఉన్న పల్లెలపైన ముస్లిం ఆర్గనైజేషన్ తమ విషపు పడగా విప్పడం జరిగిందని బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్పులేదనీ ఆముసుగులో బిజెపి నాయకులపై ఈ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తద్వారా మతకల్లోలాలను పల్లెటూర్లలో కూడా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వారు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని,తక్షణమే ఈ వ్యాఖ్యలపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. హిందూ ధర్మం సనాతన ధర్మం ఇలవేల్పు వనదుర్గా మాత సన్నిధిలో ఇకమీదట ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు గాని సంస్థలు గాని ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార సంబంధిత కార్యకలాపాలు జరగకుండా నిషేధించాలని ఎండోమెంట్ శాఖకు బిజెపి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెమోరాండం జేయడం జరిగిందన్నారు.అతి త్వరలో ఈవిషయంపై స్పందించి అన్యమతస్తులను ఏడుపాయల నుండి పంపించకపోతే హిందూ సంఘాలు,బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బిజెపి నాయకులు హెచ్చరించారు.అనంతరం జరిగే పరిణామాలకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్,కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి,మెదక్ జిల్లా నాయకులు పాపన్నపేట మండల కమిటీ నాయకులు కొల్చారం మండల కమిటీ నాయకులు పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.
