Listen to this article

జనం న్యూస్, అక్టోబర్ 11 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )

రానున్న ఎన్నికలలో జగదేవపూర్ జడ్పిటిసి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు జగదేవపూర్ మండల బిజెపి ప్రధాన కార్యదర్శి కొట్టాల మల్లేష్ అన్నారు,శనివారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కొట్టాల మల్లేష్ మాట్లాడుతూ బిజెపి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ గత ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీ రావడానికి కృషి చేయడం జరిగిందని, అధినాయకత్వం అండతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసిగా పోటీ చేయాలని సంకల్పంతో ఉన్నామని బీసీ మహిళ రిజర్వేషన్ కారణంగా మా సతీమణి కొట్టాల సౌజన్య జడ్పిటిసి గా పోటీ చేయడం జరుగుతుందని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న మాకు మీ మద్దతు కావాలని అందరూ మీ అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపించాలని కోరుకుంటు, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు.