Listen to this article

ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా జట్టును అభినందించిన ఎస్జీఎఫ్ సెక్రటరీ – దగ్గుపాటి విమల

జనం న్యూస్- అక్టోబర్ 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ నెట్ బాల్ పోటీలు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు స్టేడియంలో ఈనెల 9, 10, 11 వ తేదీల్లో జరిగాయి. 28 జిల్లాల జట్లు ఈ పోటీలలో పాల్గొనగా నల్లగొండ జిల్లా నెట్ బాల్ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరచగా వారిని ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ దగ్గుపాటి విమల అభినందించారని, నల్లగొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ జె కిరణ్ కుమార్ తెలిపారు. బాలికల విభాగంలో నల్లగొండ జిల్లా జట్టు ట్రెడిషనల్ నెట్బాల్ టోర్నమెంట్ నందు ద్వితీయ స్థానం, ఫాస్ట్ 5 టోర్నమెంట్ నందు ద్వితీయ స్థానం లో నిలువగా, బాలుర విభాగంలో నల్లగొండ జిల్లా జట్టు ఫాస్ట్5 టోర్నమెంట్ లో తృతీయ స్థానంలో నిలిచారని కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలలో పాల్గొన్న నల్లగొండజిల్లా క్రీడాకారులు అందరికీ అభినందనలు తెలిపిన కిరణ్ కుమార్, భవిష్యత్తు నెట్ బాల్ టోర్నమెంట్ లలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి నల్లగొండజిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నానని తెలిపారు.