Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మురమళ్ళ ఉప మండల ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఐ పోలవరంలో మండలం పరిధిలోని కోమరగిరి సోసైటి వద్ద ఖాళీ స్థలంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా విజయదశమి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ముందుగా కాషాయ ధ్వజానికి పూజలు నిర్వహించి గౌరవ నమస్కారం చేశారు. అనంతరం భారతమాత,మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ గురుజి,డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చిత్రపటాలుతో పాటు ఆయుధాలకు పూలమాలలు అర్పించి పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు యుగంధర్ ముఖ్య వక్తగా హాజరై ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు విశిష్టతను, విజయదశమి ఉత్సవాల గురించి ప్రసంగించారు. వంద సంవత్సరాల కాలంలో ఆర్ఎస్ఎస్ సమాజంలో వ్యక్తి నిర్మాణం చేస్తూ అనేక విజయాలను సాధించిందన్నారు ఈ భారత భూమిపై అనాధ నుండి అనేక పోరాటాలు చేస్తూ హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం జరుగుతుందన్నారు ప్రతి వ్యక్తి దేశం కోసం ధర్మం కోసం ఎప్పుడు ముందుండాలన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ సమాజంలో అసమానతలను దూరం చేసి హిందువులందరూ ఒక సంఘటిత శక్తిగా ఏర్పడినప్పుడే భారతదేశం విశ్వ గురువుగా మారుతుంది అన్నారు అదేవిధంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త నడింపల్లి వీర వెంకట సూర్య వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో గొలకోటి వెంకటరెడ్డి జిల్లా కార్యవాహ కామ్ బాబు,ముమ్మిడివరం ఖండ సంఘచాలక్ పెన్మెత్స గోపాలకృష్ణం రాజు,మురమళ్ళ ఉప మండల పరిధిలోని అన్ని గ్రామాల ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు మాతృమూర్తులు మురమల్ల, పాత ఇంజరం, పశువుల లంక, కొమరగిరి గ్రామాల హిందూ బంధువులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.