Listen to this article

ఆపదలో ఆపన్న హస్తం 108 వాహనం

జనం న్యూస్- అక్టోబర్ 12- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్-

ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడిన మనకు గుర్తు వచ్చే నెంబర్ 108. ఈ 108 సేవలు 2006 లో సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు ప్రారంభించారు. ఈ సేవలు ప్రారంభించిన అనతి కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 108 సేవలను గుర్తించి 2009లో సత్యం కంప్యూటర్ సంస్థ నుంచి ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షి ప్ (పి పి పి) పద్ధతిని అమలు చేశారు. ఆ రకంగా 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వం ప్రోత్సహించి అప్పటినుంచి జీవీకే యాజమాన్యం 108 సేవలను నిర్వహిస్తుంది.బాధితులకు మెరుగైన సేవలు – ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ – సలీం 108 అంబులెన్స్ లు క్షేత్రస్థాయిలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నాయని ప్రభుత్వ ప్రోత్సాహంతో , జీవీకే సంస్థ వారి సహకారంతో కొత్త టెక్నాలజీ సదుపాయాల వలన బాదితుల దగ్గరకు సకాలంలో చేరుకోవడం మరియు వారికి మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతుంది అని , పరిస్థితులకు అనుగుణంగా మా సిబ్బంది కి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వారికి ప్రత్యేక శిక్షణ లు ఇవ్వడం జరుగుతుంది. ఆపదలో ఉన్న ప్రతి ఒకరు 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సలీం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిస్ట్రిక్ట్ మేనేజర్ వై మధు పైలట్ శంకర్ ఈఎంటి కె రాకేష్ లు పాల్గొన్నారు.