Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం

మండల కేంద్రమైన కాట్రేనికోన గ్రామంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ వరకు 64 లక్షలు అంచనా తో నిర్మించిన సిసి రోడ్డును ఆదివారం ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో వెనకాడదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఓగూరు భాగ్యశ్రీ, స్థానిక సర్పంచ్ గంటి వెంకట సుధాకర్, ఉప్పూడి సర్పంచ్ రంబాల రమేష్,టిడిపి నాయకులు మండల టిడిపి అధ్యక్షుడు చెల్లి సురేష్, డి సి చైర్మన్ ఆకాశం శ్రీనివాస్, నాగిడి నాగేశ్వరరావు, త్సవటపల్లి నాగేంద్రరావు, ఇసుక పట్ల వెంకటేశ్వరరావు, విత్తనాల బుజ్జి, బండారు ఏసు,నల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.