

(జనం న్యూస్ అక్టోబర్ 13 ప్రతినిధి కాసిపేట రవి)
భీమారంమండలం చెన్నూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్, సోమవారం రోజున బాకీ కార్డుల కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందిఅధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలోనే 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీరేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను, మహిళలను, యువకులను, నిరుద్యోగులను, వృద్ధులను ఇలా అన్ని వర్గాల ప్రజలను హామీలు ఇచ్చి మోసం చేసిందిరెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసింది రైతులకు రైతు భరోసాను ఎగగొట్టింది, యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వలేదు, పంటలకు సరిపడా యూరియాను అందివ్వలేదు రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వంయూరియా అందక పంటల దిగుబడి తగ్గింది చేతికివచ్చిన కొద్దిపాటి పంటలకు గిట్టుబాటు ధర లేదు మహిళలకు 2500 మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిందివృద్ధులకు నెలకు నాలుగు వేల పెన్షన్ ఇంట్లో అవ్వ తాతలకు ఇద్దరికి ఇస్తామని మోసం చేసిందినిరుద్యోగులకు, యువతి యువకులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు,స్కూటీలు ఇస్తామని మోసం చేసింది22 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో హామీల అమలుపైన నిలదీయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారుబాకీ కార్డు లో ఉన్న ప్రతి హామీని నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో ఓటు అడగాలికాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రేపు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ లాంటివారు ఎన్నికలలో నిండా మునుగుడు ఖాయoఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు ,మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు ,మాజీ వార్డు మెంబర్ లు,మండల నాయకులు, కార్యకర్తలు,పార్టీ నాయకులు ,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు