

జనం న్యూస్ అక్టోబర్(13) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రం ఐకెపి సెంటర్ లో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ సోమవారం నాడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ఒక కింటాకు 2389 చొప్పున ప్రతి గింజ గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందని రైతులు దళారుల చేతిలో మోసపోవుదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.