

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్ యాదవ్
దళితుల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని, స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని, వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబన తీసుకురావాలని భావించి, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) దళిత బంధు పథకాన్ని అమలు చేశారన్నారు. పాడి కౌశిక్ రెడ్డి.. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడమే లక్ష్యంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 10 లక్షల సహాయాన్ని ప్రతి దళిత కుటుంబానికి అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అని అన్నారు.
ప్రపంచంలోనే దళితుల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం నేరుగా భారీ ఆర్థిక సహాయం చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్‌గా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, దాదాపు 18,000 దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారన్నారు . ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.కాంగ్రెస్ మోసం – హుజురాబాద్‌లో నిధుల నిలిపివేసినింది అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత బంధుపై మౌనం వహించడం ప్రారంభించింది, అని ఎన్నికల సమయంలో రూ. 12 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. హుజురాబాద్‌లో రెండో విడతగా మంజూరు చేసిన దళిత బంధు నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేసి, లబ్ధిదారులకు అందకుండా అడ్డుకుందన్నారు.ఇది దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద ద్రోహం. అని ఈ విషయంపై నిరంతరం పోరాడన్నన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే దళిత బంధు అమలుపై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చానన్నారు.• హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల సమస్యలపై అనేక కార్యక్రమాలు చేశామన్నారు. దళిత బంధు అమలుపై అసెంబ్లీలో, జిల్లా పరిషత్ సమావేశాల్ కలెక్టరేట్ సమావేశంలలో నిలదీశామన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యమాలు చేపట్టి, దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న, నిన్ను అణచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు. ఆయనపై కేసులు పెట్టి, కాంగ్రెస్ నాయకుల చేత దాడులు చేయించేందుకు ప్రయత్నించిందన్నారు. అయినా, వెనక్కి తగ్గకుండా తన పోరాటాన్ని కొనసాగించి,దళితుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసనన్నారు. దళితుల పక్షాన పోరాడిన గొంతుక నాది, కేసీఆర్ తెచ్చిన చారిత్రాత్మక దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని తెలిపారు.రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం, అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి అని పేర్కొన్నారు.