

జనం న్యూస్ 14 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
జిల్లాలో ఓట్ల కోసం గిరిజనుల చుట్టూ తిరిగే నేతలు పదవులు వచ్చాక వారి సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోవట్లదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కురుపాంలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల మృతి… వసతి గృహాల్లో పిల్లల భద్రతపై అనుమానాలు రేకెత్తించింది. అధికార, విపక్షాలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలకు పరిమితమవుతున్నారే తప్ప… నిధులు తెప్పించడం, మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారనేది ప్రధాన విమర్శ.