

జనం న్యూస్ 14 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా కోర్టులో పని చేసే మహిళా సిబ్బందికి శక్తి యాప్ వినియోగంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.భబిత అన్ని కోగ్టులలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
ఈ యాప్ ద్వారా మహిళలు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అత్యవసర రక్షణ లేదా సహాయం అందుతుందన్నారు.