Listen to this article

జనం న్యూస్ 14 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో “శ్రమదాన ” కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 42వ డివిజన్ పరిధిలో.. అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో క్లబ్ పెద్దలు,గౌరవ అధ్యక్షులు పిన్నింటి సూర్యనారాయణ, డాక్టర్ ఎ. ఎస్. ప్రకాశరావు మాష్టారు పర్యవేక్షణలో క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ, త్యాడ రామకృష్ణారావు (బాలు) నిర్వహించారు. ఇందులో భాగంగా క్లబ్ సభ్యులంతా నడక దారిలోను, మైదానంలో ఉన్న వృధా మొక్కలు, నిద్రగన్నేరు,వయ్యారి భామ మొక్కలను తొలగించి శుభ్రపరిచ్చారు.ఈ సందర్బంగా శ్రమదాన కార్యక్రమంలో పాల్గున్న ప్రముఖ సాహితీవేత్త, మాజీ పార్లమెంట్ సభ్యులు, క్రమంతప్పకుండా నడిచే సీనియర్ నడక సభ్యులు డాక్టర్ డి.వి.జి. శంకరరావు మాట్లాడుతూ మన పరిసరాల్లోనైనా, ఇటువంటి నిత్యం తిరిగే ఆరోగ్యకరమైన నడకమైదానంలోనైనా ఇటువంటి స్వచ్ భారత్, శ్రమదాన సేవాకార్యక్రమాల వలన..పరిశుభ్రత పాటించినట్లయితే ప్రజలు ఆరోగ్యానికి మంచిదని, పదిమందికి ఉపయోగపడే కార్యక్రమాలు తరుచూ చేబడుతున్న శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సభ్యులను డాక్టర్ డి.వి.జి. శంకరరావు అభినందించారు.కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ పెద్దలు జి. గోవిందరావు,వై. నల్లమరాజు, కోట్ల ఈశ్వరరావు,త్యాడ ప్రసాద్ పట్నాయక్, పెనుమత్స ప్పలరాజు,ఇందుకూరి అప్పలరాజు,టి.రమణ,అప్పారావు మాష్టారు,బడి కృష్ణమూర్తి, నరేష్ తదితర పెద్దలు పాల్గున్నారు