

జనం న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 14, (రిపోర్టర్ ప్రభాకర్):
ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు 13-10-2025 తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్స్ కార్యాలయంలో నిరసన కార్యక్రమాలు చెయ్యడం జరిగింది. జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దళితుడు అయిన బోషణ రామకృష్ణుడు గవాయి గారిపై జరిగిన దాడిని నిరసిస్తూ, ఈ ఘటనపై సమగ్రమైన విచారన జరిపించాలి.భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా దళితుడు బోషణ రామకృష్ణుడు గవాయి గారిపై జరిగిన దాడిని నిరసిస్తున్నాము ఈ ఘటనపై సమగ్రమైన విచారణ జరిపి దీని వెనుక ఉన్న శక్తులు గుర్తించి శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నాము.సీజే గారి మీద దాడి చేసిన వ్యక్తిపై న్యాయవాది రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించేలా వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలి. అందుకోసం సుప్రీంకోర్టు లో ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడే సీనియర్ జడ్జిలతో విచారణ చేయించాలి.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి. దళితులకు ఆత్మగౌరవం రాజ్యాంగ రక్షణ కల్పించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేస్తే, సామాన్య పౌరుడికి రక్షణ ఎక్కడ ఉంటుంది.ఈ సంఘటనను బట్టి భారతీయ పౌరుడు కచ్చితంగా ఖండించాలి. 2025 మే 15న షెడ్యూల్ కులాల నుండి భారతదేశపు 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు స్వీకరించిన బి.ఆర్ గవాయి, అంబేద్కర్ సిద్ధాంతాలపైన సామాజిక సమానత్వం,మానవ హక్కులపైన,న్యాయపరమైన విలువల పైన పూర్తి అవగాహన ఉన్న గొప్ప వ్యక్తి పై దాడి ప్రయత్నం అమానుష మైన చర్య. ఈ దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్ కిషోర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోని శిక్షించాలి. అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలు ,ఐఏఎస్, ఐపీఎస్ అయిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చివరకు ఈ దేశానికి రాష్ట్రపతి అయిన కులం అంటారనితనం,కుల వివక్షత అణిచివేతలు వెంబడించి హింసిస్తున్నాయి. మానసికంగా,శారీరకంగా రక్షణ లేదు. సాధారణ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి పై దాడి నుంచి ఐపీఎస్ అధికారిపై ఆత్మహత్య ప్రేరేపితం వరకు కొనసాగుతున్నాయి. సామాజిక సమానత్వం లేని రాజకీయ ప్రజాస్వామ్య ఒక చిత్తు కాగితం లాంటిది అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ అంటరానితనం కులం వారి వ్యవస్థలు నిర్మూలన జరగాలని సామాజిక అసమర్థులు ఆర్థిక అవసరతలు లేని,వివక్షతలు లేని అణచివేతలు లేని నవసమాజ రాజ్యాంగ బద్ధంగా అమలు చేయాలని కోరుచున్నాము.పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ బోస్ మన్మధరావు మరియు పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గొడబ ప్రభాకరరావు మాదిగ (సీనియర్ జర్నలిస్ట్),ఎంఈఎఫ్ జయ ప్రకాష్ మాస్టారు మాదిగ, ఎం ఈ ఎఫ్ కాగాన సాల్మన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ గ్రామీణ అధ్యక్షులు గొడబ గుంపు స్వామి మాదిగ,ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు ఎన్.ప్రసాద్ మాదిగ, మండల కన్వీనర్లు,కో కన్వీనర్లు ఎమ్మార్పీఎస్, ఎం.ఈ ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.
