

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 30. రిపోర్టర్ పవన్:- తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల శ్రీ పొట్టి శ్రీరాములు పార్క్ లో గాంధీ వర్ధంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజి విజయ భాస్కర రావు, వరల్డ్ ఆర్యవైశ్య సంఘం ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ పోలేపల్లి జనార్దన్ ఆధ్వర్యంలో లో ఘనంగా నిర్వగించారు మొదటిగా ఆంధ్రరాష్ట్ర అవతరణ మూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మహాత్మ గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈసందర్బంగా జవ్వాజి విజయ భాస్కర రావు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.గాంధీని ప్రజలు ప్రేమతో “బాపు” అనీ, “మహాత్ముడు” అనీ పిలుచుకొనసాగారు అని అన్నారు ఈ కార్యక్రమం లో ఆర్యవైశ్య సంఘం సెక్రటరి కశెట్టి రవి, కోశాదికారి చినమనగొండ సుబ్రహ్మణ్యం,నెహ్రు యూత్ అధ్యక్షులు పుల్లయ్య,కొలగట్ల భాస్కర్ రెడ్డి, కొత్తేర్వ వెంకటేశ్వర రెడ్డి, షేక్ వలి,వాసవి క్లబ్ మహిళలు సురే సువర్ణ, కొప్పరపు రత్తమ్మ, ఆర్యవైశ్య సభ్యులు దోగిపర్తి మల్లిఖార్జున, జవ్వాజి వెంకటేశ్వర్లు, గుణుపూటి వెంకటేశ్వర్లు, సురే ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు