

జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
శృంగవరపుకోటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 11 కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ బి.మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 557 కేసులు నమోదు చేసి, రూ.34.12 లక్షల జరిమానా, రూ.24.12 లక్షల రాజీ రుసుం వసూలు చేసినట్లు చెప్పారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దాడులు కొనసాగుతాయని ఆయన తెలిపారు.