

విద్యను అభ్యసించడానికి తన కష్టాన్ని,ఇష్టంగా మార్చి,ఎంబీబీఎస్ సాధించిన కాపార్తి మణికంఠ,
జనం న్యూస్,అక్టోబర్ 15,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,గ్రామానికి చెందిన కాపార్తి చైతన్య వెంకటేశ్వర్,దంపతులు బీద మధ్యతరగతి కుటుంబానికి చెందినవరు.జీవన ఉపాధికై అతి కష్టతరమైన జీవితాన్ని, చిరు వ్యాపారం నిర్వహిస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తూ, తమ పిల్లలకు ఉన్నతమైన విద్యను అభ్యసించాలన్న దృఢ సంకల్పంతో తరచుగా తమ కుమారుడిని విద్యను అభ్యాసించాలని అంటూ ఉండేవారు. కాపార్తి వెంకటేశ్వర్, తనయుడు కాపార్తి మణికంఠ,విద్యను అభ్యసించడానికి కష్టానికి ఇష్టంగా, ఉన్నతమైన విద్యను అభ్యసించి మట్టిలో మాణిక్యంల నీట్ లో ఉత్తీర్ణులయ్యారు. కాపార్తి మణికంటా,1వ తరగతి నుంచి 7వ తరగతి బ్లూ బెల్స్ స్కూల్ పిట్లం,8వ తరగతి నుంచి 10వ తరగతి మాట్రిక్స్ స్కూల్ వర్ని,11వ 12వ,శ్రీ చైతనయ్య అగస్త్య శ్రీ భవన్ బరంపేట్,నీట్ యూజీ మర్క్స్ 538,అల్ ఇండియా ర్యాంక్,18326, తెలంగాణ స్టేట్ ర్యాంక్ 352,ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్,లో స్థానం దక్కింది.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధుమిత్రులు, మణికంఠను అభినందించారు.