Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

రబీ పంట సీజన్ సమయంలో ఐకెపి సెంటర్ లలో జరిగిన అక్రమాల విషయంలో తేది: 11-10-2025 రోజున శాయంపేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసు సి ఆర్ నెంబర్. 196/2025 లోనీ నేరస్థులలో ఇద్దరు నేరస్తులు వాంకుడోత్ చరణ్ తండ్రి శంకర్, వయస్సు: 29 సం”లు, కులం ఎస్ టీ లంబాడి, వృత్తి: డాటా ఎంట్రీ ఆపరేటర్ శాయంపేట మండలంలోని గ్రామం కాట్రపల్లి క్లస్టర్ ఐకెపి సెంటర్ ఇంచార్జ్ అల్లే అనిత భర్త రవి, వయస్సు:35సం”లు, కులం ముదిరాజ్ గ్రామం కాట్రపల్లి గ్రామం లను తేది : 14-10-2025 న పరకాల ఏసిపి సతీష్ బాబు శాయంపేట సి.ఐ. పి రంజిత్ రావు వారి ఇద్దరిని అరెస్ట్ చేసి, ఐకేపీ సెంటర్ లో ట్యాబ్ ఆపరేటర్ అయిన చరణ్ నుండి 20,000/- నగదు సెల్ ఫోన్ ను, కాట్రపల్లి ఐకేపీ సెంటర్ ఇంచార్జ్ అనిత వద్ద ఐకేపి సెంటర్ కు సంబంధించిన ట్యాబ్ ను, టోకెన్ షీట్ బుక్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించామని ఏసిపి సతీష్ బాబు తెలియజేశారు….