పీ.ఏ.పల్లి మండలం లోని వద్దిపట్ల గ్రామంలో బాలాజీ నాయక్ వడ్డీ వ్యాపారి గా మారి అమాయక ప్రజలకు 10 రూపాయల నుండి 16 రూపాయలు వడ్డీ ఇస్తా అని నమ్మబలికి పలుగు తండా,వద్దిపట్ల, పీ. ఏ పల్లి,సాగర్,మిర్యాలగూడ, ఆంధ్రా ప్రాంతాల్లో అనేక మంది దగ్గర ఏజెంట్ లు పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన బాలాజీ కొద్ది రోజులు వడ్డీ ఇచ్చి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తిరుగుతూ ఉండగా పలుగు తండా ఇంటికి బాధితులు వెళ్ళి పర్నిచెర్,తగులబెట్టి ఉండగా ఒక వ్యక్తి సూర్యనాయక్ క్రిమి సంహారక మందు తాగి చనిపోయాడు.అప్పుడు రంగం లోకి ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఏ ఎస్పీ మౌనిక స్టేషన్ కి వచి బాధితులను పిలిపించి మాట్లాడి,తదనంతరం బాలాజీ నీ నల్గొండ లో అరెస్ట్ చేసి వాహనాలు,50 కోట్ల రూపాయలు కి సంబంధించి పేపర్స్ జప్తు చేసుకొని, వారం రోజుల గుడిపల్లి పోలీస్ స్టేషన్ క్యాంప్ పెట్టారూ బాదితులు రోజు వచ్చీ పోలీస్ స్టేషన్ లో బాధితులు దరఖాస్తు పెట్టుకుంటున్నారు.సుమారు 250 మంది బాదితులు గా గుర్తించారు. ఇంకా ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని బాదితులు ఆదర్యపడవద్దు అని కోర్టు నుండి డబ్బులు ఇప్పిస్తామని చెప్పాడు.ఎస్పీ, అదనపు ఎస్పీ రమేష్, ఏ ఎస్పీ మౌనిక, సి ఐ నవీన్ కుమార్,గుడిపల్లి ఎస్ ఐ నర్సింహులు ,పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


