Listen to this article

జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల జిల్లా: – జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ సవరన్న ఆధ్వర్యంలో పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు గత నాలుగున్నర నెలల నుంచి పాఠశాలలో జరిగిన బోధనలను నర్సరీ నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు నేర్చుకున్న పాఠ్యాంశాలను తల్లిదండ్రులకు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు పిల్లలు తెలియపరచడం జరిగిందని ఇట్టి అవగాహన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని విద్యార్థులు నేర్చుకున్న పాఠ్యాంశాలను తల్లిదండ్రులకు చాలా చక్కగా తెలియపరచారని ప్రతి స్టూడెంట్ పాఠశాలలో చెప్పే పాఠాలను శ్రద్ధగా విని చదువులో ప్రావీణ్యం కలగాలని అదేవిధంగా పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని పాఠశాల కరస్పాండెంట్ సవరన్న తెలిపారు.ఈరోజు ప్రగతి పాఠశాలలో నిర్వహించిన ఎస్. ఎల్. సి “స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్” ప్రోగ్రాం చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాము.ఇందులో విద్యార్థులు తాము నేర్చుకొని, తయారుచేసిన ఎగ్జిబిట్స్ గురించి ఎంతో ఆత్మవిశ్వాసంతో వివరించారు.ఈ కార్యక్రమం వల్ల తమ పిల్లల యొక్క విద్యాభివృద్ధి గురించి తెలుసుకునే అవకాశం కల్పించినందుకు తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తపరిచారు . తాము నేర్చుకున్న విషయానికి, తమ మేధస్సును జోడించి, ఎగ్జిబిట్స్ తయారు చేసి, వివరించిన విద్యార్థులందరికీ పాఠశాల కరస్పాండెంట్ సవారన్న అభినందనలు తెలిపారు..ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.