Listen to this article

జనం న్యూస్ : 15 అక్టోబర్ బుధవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్

లీడ్ ఇండియా మరియు ట్రస్మా ఆధ్వర్యంలో డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. అబ్దుల్ కలాం జన్మదినోత్సవాన్ని ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పోకల సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పడగ భాస్కర్, జిల్లా కోశాధికారి గాలిపల్లి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.హైదరాబాద్ రవీంద్రభారతి ఫంక్షన్ హాల్‌లో జరిగిన లీడ్ ఇండియా ప్రధాన కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొని “బెస్ట్ టీచర్ అవార్డు” అందుకున్నారు.