

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీ లావుతో కలిసి పాల్గొన్న పుల్లారావు.
రాష్ట్రాభివృద్ధి, సమాజసేవలో భాగస్వాములు కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుపై కార్పొరేట్ కంపెనీలు, సేవాసంస్థలు, ఎన్నారైలు ఆలోచించాలని, ఒయాసిస్ వంటి స్వచ్ఛంద సేవాసంస్థలు సమాజసేవలో ముందుండటం నిజంగా అభినందనీయమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం రాత్రి పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి ముఖ్యఅతిథి హోదాలో పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉండి, సేవాభావం కలిగిన కొందరు మహిళల్ని ఏకం చేసి, ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటుచేసిన ప్రముఖ వైద్యురాలు కందిమళ్ల జయలక్ష్మి (జయమ్మ) ని అభినందిస్తున్నానన్నారు. చిలకలూరిపేట సేవాసంస్థలకు పెట్టింది పేరని, పేద..మధ్యతరగతి మహిళలను ఆర్థికంగా, హర్థికంగా ఒయాసిస్ సేవాసంస్థ అండగా నిలుస్తోందన్నారు. ఒయాసిస్ సేవాసంస్థకు తాను మంత్రిగా ఉన్నప్పుడే 3 ఎకరాల భూమి కేటాయించానని, గత ప్రభుత్వం అడ్డంకులు కల్పించడంతో సంస్థ అనుకున్నలక్ష్యం నెరవేరలేదన్నారు. సంస్థ కార్యకలాపాలకు తాను, ఎంపీ కృష్ణ దేవరాయలు తగిన సహాయసహకారాలు అందించడానికి ఎప్పుడూ సిద్ధమేనని పుల్లారావు స్పష్టం చేశారు. ప్రజలకోసం పనిచేసే ఒయాసిస్ లాంటి సేవా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా తగిన ప్రోత్సాహం లభించేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా ఓయాసిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు, ట్రై సైకిల్లు, కుట్టు మిషన్లో, అందజేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన మాజీమంత్రి చిన్నారుల్ని, నిర్వాహకుల్ని, కళాకారుల్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, ఓయసీస్ సెక్రెటరీ కరణం విజయలక్ష్మి, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరిముళ్ళా, మద్ధుమలా రవి, ఆర్గనైజింగ్ సభ్యులు తదితులున్నారు.