

జనం న్యూస్ జనవరి 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- శాంతి అహింసలనే ఆయుధాలుగా చేసుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ మొత్తం భారతదేశానికే జాతిపితగా మారారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా బాలా నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్ముడి ఫోటోకు రమేష్ స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీ పాత్ర మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, నాయకులు, మైనారిటీ నాయకులు, యస్ సి సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు