

జనం న్యూస్ 30 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ అహింసా వాదంతో ఎంతటి కఠిన లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని నిరూపించి వలసవాదుల చెరనుండి అఖండ భారతావనికి విముక్తి కలిగించి ప్రపంచానికి నూతన పోరాట ఒరవడిని నేర్పిన జాతిపిత మహాత్మా గాంధీ అని అహింసా, ధర్మం, శాంతియుత పోరాటం ద్వారా హక్కులను సాధించుకోవచ్చనే గొప్ప సందేశాన్ని జాతికి అందించిన మహనీయుడు మహాత్మా గాంధీని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ యూత్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ (బక్కి) డాక్టర్ బొల్లెపోగు రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాక రమేష్ బత్తిని రవి, నరేందర్, రావుల రమేష్ మాజీ యూత్ మండల అధ్యక్షులు అంబాల స్వామి యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మండ సుమన్ గౌడ్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల చైతన్యకుమార్ చల్లూరి వేణు బాబురావు గూడెల్లి నవీన్ కుమార్, వంగ నితిన్, అజయ్,అంబాల జగన్, ప్రభాస్,అంచనాగిరి వెంకటేష్ గోడిశాల ప్రదీప్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు