

సమ్మెకు సీఐటీయూ మద్దతు
అచ్యుతాపురం(జనం న్యూస్): బ్రాండిక్స్ అధిస్థాన్ యాజమాన్యం ఫిబ్రవరి 1 నుండి అరగంట పని దినం పెంపుకు నిరసనగా ఏ,బి షిఫ్ట్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. కంపెనీ గేట్లు తోసుకొని బయటికి వచ్చి నిరసన తెలియజేశారు. ఈ సమ్మెకు సీటు సంపూర్ణమైన మద్దతు తెలిపింది. మహిళా కార్మికులు రోజు 8 గంటల డ్యూటీతోపాటు ప్రయాణానికి సుమారు నాలుగు నుండి ఐదు గంటలు వస్తుందని రోజుకి 12 గంటలు కంపెనీకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో కంపెనీ యాజమాన్యం ఫిబ్రవరి 1 నుండి షిఫ్ట్ కి అరగంట డ్యూటీ పెంచడంతో కార్మికులందరూ అసంతృప్తితో డ్యూటీకి వచ్చి ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ శంకర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము మాట్లాడుతూ కార్మికులు కంపెనీకి వచ్చి డ్యూటీ చేసి వెళ్తే 14 గంటలు సమయం పడుతుందని,
కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఉండటం లేదని అటువంటిది డ్యూటీ సమయాన్ని పెంచడం సరికాదని బ్రాండిక్స్ యాజమాన్యం ప్రభుత్వ రాయితీలు పొందుతుందని,కార్మికుల కనీస వేతనాలు అమలు కావడం లేదని,టార్గెట్లు పేరుతో గతంలో 1500 ఫీసులు చేస్తే నేడు 3000 కి పెంచారని కార్మికులకు అవసరమై సెలవు పెడితే రోజుకి 500 రూపాయలు జీతం కట్ చేస్తున్నారని గతంలో పిల్లలకు స్కాలర్షిప్లు,బ్యాగులు వైద్య ఖర్చులు చెల్లించేవారని ఇప్పుడు అవేమి అమలు చేయడం లేదని అన్నారు. ఈ సమ్మె లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాథం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిడి. వరలక్ష్మి,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి. సత్యనారాయణ, వివి శ్రీనివాసరావు, కే సోమనాయుడు తదితరులు పాల్గొన్నారు.